బైబై గణేషా | bye bye ganesh | Sakshi
Sakshi News home page

బైబై గణేషా

Sep 11 2016 11:15 PM | Updated on Mar 28 2018 11:26 AM

బైబై గణేషా - Sakshi

బైబై గణేషా

మండలంలోని ఏదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువువద్ద ఆదివారం వినాయక విగ్రహాల నిమజ్జనం జోరుగా కొనసాగింది. సమీప గ్రామాలతో పాటు నగరశివారులోని పలు కాలనీల్లో ప్రతిష్ఠించిన స్వామివారి ప్రతిమలను ట్రాలీలు, ఆటోలు, డీసీఎంలు, కార్లు తదితర వాహనాల్లో ఒక్కడకు తెచ్చి నిమజ్జనం చేశారు.

 ఘట్‌కేసర్‌ టౌన్‌: మండలంలోని ఏదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువువద్ద ఆదివారం వినాయక విగ్రహాల నిమజ్జనం జోరుగా కొనసాగింది. సమీప గ్రామాలతో పాటు నగరశివారులోని పలు కాలనీల్లో ప్రతిష్ఠించిన స్వామివారి ప్రతిమలను ట్రాలీలు, ఆటోలు, డీసీఎంలు, కార్లు తదితర వాహనాల్లో ఒక్కడకు తెచ్చి నిమజ్జనం చేశారు. బ్యాండ్‌ మేళాలతో నృత్యం చేస్తూ గణేషుడికి వీడ్కోలు పలికారు. విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి.. చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న పులిహోరా, ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ ప్రకాష్‌, సర్పంచ్‌ మూసీ శంకరన్న తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement