స్థిరపడలేక పోయానని యువకుడి ఆత్మహత్య | Young Man Committed Suicide | Sakshi
Sakshi News home page

స్థిరపడలేక పోయానని యువకుడి ఆత్మహత్య

May 16 2018 12:46 PM | Updated on Oct 17 2018 6:10 PM

Young Man Committed Suicide - Sakshi

ఇంటివద్ద గుమిగూడిన గ్రామస్తులు ,సాయిరాం(ఫైల్‌)

బీర్కూర్‌ : మండలంలోని వీరాపూర్‌కు చెందిన యు వకుడు మావురం సాయిలు అలియాస్‌ సాయిరాం(25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సంపత్‌కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మృదు స్వభావి అయిన సాయిరాం స్థానిక పాఠశాలలో వీవీగా పనిచేస్తున్నాడు.

గతంతో ఎమ్మెస్సీ పరీక్షల్లో కొన్ని పేపర్లు ఫెయిలయ్యాడు. మళ్లీ రెండుమూడు రోజుల్లో పరీక్ష ఉందనగా పాస్‌ అవుతానో లేదోననే బెంగ తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తమ్ముడు ఎమ్మెస్సీ పాస్‌ అయి పోయాడని తాను మాత్రం ఇంకా పాస్‌కాలేదని ఉద్యోగం సాధించి తాను జీ వితంలో ఎప్పటికి స్థిరపడుతానో అంటూ మదన పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చెక్కుల పంపిణీ కేంద్రానికి సాయిరాం తల్లి గంగవ్వ వెళ్లగానే గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement