
మృతి చెందిన గవరయ్య
వీరఘట్టం : వీరఘట్టం–పాలకొండ సి.ఎస్.పి రహదారిలో తూడి జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ కుమిలి గవరయ్య(47) మృతి చెందాడు. పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పెద్దబుడ్డిడిలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లిన గవరయ్య తిరుగు ప్రయాణంలో పెద్దబుడ్డిడి నుంచి వీరఘట్టం మండలంలోని దశుమంతపురం చేరుకున్నారు.
అక్కడి నుంచి కంబర మీదుగా విక్రమపురం కాలినడకన చేరుకుని విక్రమపురం జంక్షన్‌లో పార్వతీపు రం నుంచి శ్రీకాకుళం వెళుతున్న ఆటో ఎక్కా డు. డ్రైవరు పక్కనే కూర్చున్న గవరయ్య అప్పటికే అలసట చెంది ఉండడంతో నిద్రలోకి జారుకోవడంతో పట్టుతప్పి జారిపడ్డాడు.
రో డ్డుకు తల తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే 108 సిబ్బంది వచ్చి ప్రథమచికిత్స చేసి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు గవరయ్య మృతిచెం దినట్లు నిర్ధారించారు. ఈయనకు భార్య కళావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.