అవినీతి లెక్క తేలింది 

MEPMA Irregularities In Chittoor - Sakshi

మెప్మా అక్రమాల గుట్టు వెలుగులోకి

జిల్లా పీడీకి చేరిన ఆడిట్‌ నివేదిక

తిరుపతి మెప్మాలో జరిగిన అవినీతిని అధికారులు నిగ్గు తేల్చారు. కొన్నేళ్లుగా చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు ఆడిట్‌ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అవినీతి ఆరోపణలు రావడంతో లెక్క తేల్చేందుకు సెపె్టంబర్‌లో పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహించారు. సుదీర్ఘంగా ఆడిట్‌ నిర్వహించి టీఎల్‌ఎఫ్‌ (టౌన్‌లెవెల్‌ ఫెడరేషన్‌)లో జరిగిన అవినీతి లెక్క తేల్చారు. ప్రధానంగా రెండు టీఎల్‌ఎఫ్‌ల్లో జరిగిన అవినీతి రూ.35.5 లక్షలని తేలింది. ఈ ఆడిట్‌ రిపోర్టును గతనెల చివరిలో సంబంధిత మెప్మా పీడీకి నివేదిక పంపించారు. అవినీతి సొమ్మును అక్రమార్కుల నుంచి కక్కిస్తారా? గతంలోలాగా తొక్కిపెడతారా? అనేది తేలాల్సి ఉంది. 

సాక్షి , తిరుపతి : తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గడిచిన ఐదేళ్లలో టీడీపీ నేతలు అధికారం అడ్డుపెట్టుకుని మెప్మా గ్రూపుల్లో పెత్తనం చెలాయించారు. తమ అనుకూల వ్యక్తులను లీడర్లుగా నియమించుకుని మెప్మా నిధులను అడ్డంగా మెక్కేశారు. అప్పటి అధికార పార్టీ అండ ఉండడంతో కొంతమంది టీఎల్‌ఎఫ్, ఎస్‌ఎల్‌ఎఫ్‌ లీడర్లు ఇష్టారాజ్యంగా మెప్మా నిధులను స్వాహాచేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో అవినీతి ఒక్కొక్కటే వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం మారడంతో పాటు మెప్మా అధికారులు మారారు. ఈ నేపథ్యంలో అవినీతి లెక్క తేల్చేందుకు యంత్రాంగం నడుం బిగించింది. నెలపాటు సుదీర్ఘంగా టీఎల్‌ఎఫ్, ఎస్‌ఎల్‌ఎఫ్‌(స్లమ్‌ లెవల్‌)ల వారీగా పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహించారు. ఈ ఆడిట్‌లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చా యి. టీఎల్‌ఎఫ్‌ లీడర్లు ఇష్టారాజ్యంగా తప్పుడు బిల్లులు సమరి్పంచి, అసలు బిల్లులే పెట్టకుండా మెప్మా నిధులను దోచుకున్నారని ఆడిట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలో నాలుగు టీఎల్‌ఎఫ్‌ల పరిధిలో 155 ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ద్వారా 4,300 డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా సంఘాల లావాదేవీలు ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ద్వారా టీఎల్‌ఎఫ్‌లకు చేరుతాయి. పూర్తిస్థాయిలో డ్వాక్రా సంఘాలను టీఎల్‌ఎఫ్‌ లీడర్లు నడుపుతుంటారు. లక్షలాది రూపాయల లావాదేవీలు వీరి ద్వారానే జరుగుతుంటాయి. 

తిరుపతిలో డ్వాక్రా సంఘాల వివరాలు  

పరిధి  తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ 
టీఎల్‌ఎఫ్‌లు అభ్యుదయ, స్పందన, పద్మావతి, సరస్వతి
ఎస్‌ఎల్‌ఎఫ్‌లు 155 
డ్వాక్రా గ్రూపులు 4,300 
డ్వాక్రా సంఘాల సభ్యులు 43,000 మంది

నిగ్గు తేల్చింది ఇలా.. 
మెప్మా అధికారులు డ్వాక్రా గ్రూపులను ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ఏకంగా 2014 నుంచి టీఎల్‌ఎఫ్‌ల వారీగా ఆడిట్‌కు ఆదేశించారు. సెపె్టంబర్‌లో ప్రారంభమైన ఆడిట్‌ సుదీర్ఘంగా నిర్వహించి పక్కా ఆధారాలతో సహా అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చారు. డ్వాక్రా సభ్యుల పిల్లల స్కాలర్‌íÙప్‌లు, నెలవారీ నిర్వహణ ఖర్చులు, రసీదు బుక్కులు, పొదుపు నిధులు, సర్వసభ్య సమావేశాల నిర్వహణ పేరుతో విచ్చలవిడిగా టీఎల్‌ఎఫ్‌ లీడర్లు మెప్మా నిధులను స్వాహా చేసినట్లు తేల్చారు. వీటికి సంబంధించిన సరైన ఆధారాలు, మినిట్స్‌ బుక్స్‌ చూపలేదని ఆడిట్‌ నివేదికలో పొందుపరిచారు. కొంతమంది లీడర్లు మినిట్స్‌ బుక్స్‌ మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే పొదుపు, పసుపు–కుంకుమ నిధులను సైతం మింగేశారని, వీటికి సంబంధించిన ఆధారాలు సైతం మాయం చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యుదయ టీఎల్‌ఎఫ్‌లో ఏకంగా రూ.25 లక్షల వరకు అవినీతి జరిగిందని, వీటికి సంబంధించిన ఆధారాలు సక్రమంగా లేవని, స్పందన టీఎల్‌ఎఫ్‌లోను రూ.10.5 లక్షలకు సంబంధించి ఆధారాలు లేవని తేల్చారు. 

అధికారుల వద్దకు నివేదిక 
ఆడిట్‌ నివేదికను ఇప్పటికే మెప్మా పీడీ జ్యోతికి అందజేశారు. పరిశీలించిన ఆమె చర్యల కోసం మెప్మా డైరెక్టర్‌ చిన్నతాతయ్యకు పంపించారు. ఈ నివేదికను బయటపెట్టేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ నేతల అండదండలతో పాటు కొంతమంది మెప్మా సిబ్బంది ప్రమేయం కూడా ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలోనూ మెప్మా అవినీతి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మెప్మా సిబ్బంది ప్రమేయం ఉండడంతో ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చేతులెత్తేశారు. ఇప్పటికైనా ఆడిట్‌ నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డ అవినీతి లీడర్లు భరతం పట్టి మెక్కిన సొమ్మును కక్కిస్తారా? లేదా? గతంలో లాగా చేతులెత్తేస్తారా? వేచి చూడాల్సింది.      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top