ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Man Committed Suicide - Sakshi

భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త మనస్తాపం

ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం

అనాథలైన ముగ్గురు చిన్నారులు

నక్కర్తమేడిపల్లిలో ఘటన

యాచారం: భార్య అక్రమ సంబంధం పెట్టుకుం దని మనస్తాపానికి గురైన భర్త ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కటకటాల్లోకి వెళ్లే పరిస్థితి రావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాలు... నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మోటె లింగం(36)కు కొత్తపల్లి గ్రామానికి చెందిన లలితతో పదేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి అఖిల(10), గోపిచంద్‌(6), సిరి(3) ముగు ్గరు పిల్లలున్నారు. లలిత గ్రామానికి చెందిన నరేందర్‌ అనే వ్యక్తితో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. పసిగట్టిన భర్త లింగం పలుమార్లు భార్య లలితను హెచ్చరించాడు. అయినా లలితలో మార్పు రాలేదు. పక్షం రోజుల క్రితం లింగం పిల్లలను చూసైనా పద్ధతి మార్చు కోవాలని  లలితను గట్టిగా హెచ్చరించాడు.

భర్తపై కోపంతో లలిత చెప్పకుండానే తల్లిగారిళ్లు కొత్తపల్లికి వెళ్లిపోయింది. భార్య, భర్తల మధ్య ఘర్షణ చిన్నారులపై పడుతుందని తెలుసుకున్న సర్పంచ్‌ బాషా, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ మోటె శ్రీశైలంలు లింగంకు నచ్చజెప్పి కొత్తపల్లిలో ఉన్న లలితను కొద్ది రోజుల కిందే నక్కర్తమేడిపల్లికి తీసుకువచ్చారు. మళ్లీ ఏమైందో ఏమో గాని శనివారం ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

అక్రమ సంబంధం వద్దంటే కొనసాగిస్తున్నావ్‌... గ్రా మంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పో యిందని మనుస్తాపానికి గురైన లింగం శనివారం రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అదే రాత్రి నక్కర్తమేడిపల్లికి చేరుకుని లింగం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. తండ్రి మృతిచెందడం, తల్లిని దాచిపెట్టడం చూసిన పిల్లలు బోరున  విలపిస్తున్న తీరు గ్రామస్తులు, బంధువులను కన్నీరు పెట్టించింది.  

లలిత, నరేందర్‌లను అరెస్టు చేయాలి... 

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి నుంచి ఆదివారం సాయంత్రం లింగం మృతదేహన్ని నక్కర్త మేడిపల్లిలోని ఆయన ఇంటికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన లింగం బంధువులు, గ్రామస్తులు భర్త మృతికి కారణమైన లలితను చంపేయాలి, అక్ర మ సంబంధం పెట్టుకున్న నరేందర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

పోలీసులు చర్యలు తీసుకోనిదే అంత్యక్రియలు జరిపేది లేదని గ్రామస్తులు, బంధువులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. లలితను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణంరాజు హామీ ఇచ్చారు. నరేందర్‌పై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. శాంతించిన బంధువులు, గ్రా మస్తులు సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top