ఎయిడ్స్‌ అంటించావ్‌.. క్షమించేది లేదు

British Man Infected HIV to Others Get Life Imprisonment - Sakshi

లండన్‌ : తనకున్న సుఖవ్యాధిని కావాలనే పది మందికి అంటించిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. దయతో శిక్ష తగ్గించాలన్న అతగాడి విజ్ఞప్తిని కోర్టు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది. ‘ఐదుగురి జీవితాలను నాశనం చేసిన నీకు బయటతిరిగే హక్కు లేదు’ అంటూ ఓ బ్రిటన్‌ కోర్టు.. జీవిత శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిగ్‌టోన్‌కు చెందిన డరైల్‌ రోవ్‌(27) ఓ ప్రముఖ కంపెనీలో హెయిర్‌ డ్రెస్సర్‌. 

విలాసాలకు మరిగిన ఇతగాడికి 2015 లో ఎయిడ్స్‌ వ్యాధి సోకింది,(తల్లిదండ్రుల నుంచే సోకిందని అతని బంధువు ఒకరు చెప్పటం విశేషం). అయినప్పటికీ ఓ ‘గే’ డేటింగ్‌ యాప్‌ ద్వారా ఐదుగురు పురుషులతో సంబంధాలను కొనసాగించాడు. వారితో రక్షణ లేకుండానే లైంగిక చర్యల్లో పాల్గొనటం.. తద్వారా వారికీ హెచ్‌ఐవీ సోకింది. డరైల్‌ చేష్టలు ఇక్కడితో ఆగలేదు. ‘నాకు ఎయిడ్స్‌ ఉందోచ్‌’ అంటూ సందేశాలు పెట్టాడు. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతను పోలీసులకు తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల యత్నించారు. చివరకు వాస్తవాలు తేలటంతో నేరం అంగీకరించాడు. 

అతని శాడిజంపై బ్రిగ్‌టోన్‌ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎందరో యువకుల జీవితాలను రాక్షసంగా నువ్వు నాశనం చేశావ్‌. పైగా సురక్షిత శృంగారానికి వీలున్నా.. కావాలనే నిరాకరించావ్‌. నీలాంటి వాడికి సమాజంలో బతికే హక్కు లేదు. జీవిత కాల శిక్షే సరైంది’ అని జడ్జి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top