మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై: మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నాలుగురోజులు వరుస నష్టాలకు బ్రేక వేస్తూ దాదాపు 100 పాయింట్లకు పైగా లాభంతో పాజిటివ్ నోట్ తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 101 పాయింట్ల లాభంతో 26,660 దగ్గర, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 8,078దగ్గర ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఆసియన్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మార్కెట్లు జోరుమీదున్నాయి.
అయితే ఈ నెలలో తేలనున్న బిహార్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ పై ప్రభావం చూపొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.
మరోవైపు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో రూపాయి కొంచెం మెరుగుపడింది. 19 పైసలు లాభపడి 65.40 దగ్గర ట్రేడవుతోంది. అటు చైనా మార్కెట్లు లాభాలతో మొదలవ్వగా, డాలర్ తో పోలిస్తే యాన్ బలహీనంగా ట్రేడవుతోంది.