రేపు గుంటూరులో... సాక్షి మైత్రి మదుపరుల అవగాహన సదస్సు | Alliance investors' understanding of the Convention on Sakshi tomorrow in Guntur | Sakshi
Sakshi News home page

రేపు గుంటూరులో... సాక్షి మైత్రి మదుపరుల అవగాహన సదస్సు

Aug 29 2015 12:24 AM | Updated on Sep 3 2017 8:18 AM

రేపు గుంటూరులో...  సాక్షి మైత్రి మదుపరుల అవగాహన సదస్సు

రేపు గుంటూరులో... సాక్షి మైత్రి మదుపరుల అవగాహన సదస్సు

పెట్టుబడి అవకాశాలపై మదుపరుల్లో అవగాహన కలిగించడానికి‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట ‘సాక్షి’ నిర్వహిస్తున్న మదుపరుల అవగాహన సదస్సు

సాక్షి, బిజినెస్ బ్యూరో : పెట్టుబడి అవకాశాలపై మదుపరుల్లో అవగాహన కలిగించడానికి‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట ‘సాక్షి’ నిర్వహిస్తున్న మదుపరుల అవగాహన సదస్సు ఆదివారం గుంటూరులో జరగనుంది. గుంటూరు అరండల్ పేట్‌లోని వైన్ మర్చంట్స్ చాంబర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ జరిగే ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఆర్థిక నిపుణులు పాల్గొంటారు.

మదుపరుల ముందు ఉన్న వివిధ అవకాశాలను వివరించటంతో పాటు, మదుపు చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరు తగిన సూచనలిస్తారు. ‘సాక్షి’తో కలిసి ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్, సీడీఎస్‌ఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుకు ప్రవేశం ఉచితం. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కోసం ‘9505555020’ నంబర్లో సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement