breaking news
SBI Cap Securities
-
రుణ పరిష్కార బాటలో విదర్భ
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికలో ఉన్న విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్(వీఐపీఎల్) సలహాదారుగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేసుకుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన వీఐపీఎల్ రుణ పరిష్కారానికి వీలుగా ఎస్బీఐ క్యాప్స్ బిడ్స్‌ను ఆహా్వనించనుంది. తద్వారా కంపెనీకిగల రూ. 2,000 కోట్ల రుణాల విక్రయం లేదా వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను చేపట్టనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో రుణదాతలకు రుణాల గరిష్ట రికవరీకి ఎస్బీఐ క్యాప్స్ కృషి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెపె్టంబర్ 30లోగా రుణ పరిష్కార ప్రణాళికలను ముగించవలసి ఉంది. కాగా.. ఈ ప్రాసెస్(వీఐపీఎల్ రుణాలు, ఓటీఎస్) నిర్వహణను 2023 జూన్ 8న ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పూర్తిచేయవలసి ఉంటుంది. అయితే రుణాలు, ఓటీఎస్‌కు సంబంధించి వీఐపీఎల్ రుణదాతలకు ఇప్పటికే మూడు సువో మోటో బిడ్స్ దాఖలుకాగా.. కంపెనీ తాజాగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంచుకోవడం గమనార్హం! -
‘జెట్’ విక్రయంలో కదలిక!
ముంబై: జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూపు బుధవారం ఎస్బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్ గ్రూపు సీఈవో రాహుల్ గన్‌పులే తెలిపారు. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్బీఐ క్యాప్స్ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జెట్ కోసం తాము ఈ నెల 8న బిడ్ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్బీఐ క్యాప్స్ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్ ఎయిర్వేస్కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్బీఐ క్యాప్స్ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్ బిడ్ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది. హిందుజాలను ఒప్పించే యత్నం? జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్ ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందుజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రదించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్ హిందుజాతో ఎతిహాద్ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, మీడియా, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది. మరింత నష్టపోయిన షేరు కంపెనీ నిర్వహణ విషయంలో అస్పష్టత నేపథ్యంలో వరుసగా మూడో రోజూ జెట్ ఎయిర్వేస్ షేరు నష్టపోయింది. కంపెనీ సీఈవో వినయ్‌దూబే, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాల్ రాజీనామాలు చేయడం షేరుపై ప్రభావం చూపించాయి. బీఎస్ఈలో బుధవారం షేరు ధర 4 శాతానికి పైగా నష్టపోయి 123.70 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.120.25 నమోదు చేసింది. -
రేపు గుంటూరులో... సాక్షి మైత్రి మదుపరుల అవగాహన సదస్సు
సాక్షి, బిజినెస్ బ్యూరో : పెట్టుబడి అవకాశాలపై మదుపరుల్లో అవగాహన కలిగించడానికి‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట ‘సాక్షి’ నిర్వహిస్తున్న మదుపరుల అవగాహన సదస్సు ఆదివారం గుంటూరులో జరగనుంది. గుంటూరు అరండల్ పేట్‌లోని వైన్ మర్చంట్స్ చాంబర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ జరిగే ఈ కార్యక్రమంలో ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఆర్థిక నిపుణులు పాల్గొంటారు. మదుపరుల ముందు ఉన్న వివిధ అవకాశాలను వివరించటంతో పాటు, మదుపు చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరు తగిన సూచనలిస్తారు. ‘సాక్షి’తో కలిసి ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, సీడీఎస్ఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుకు ప్రవేశం ఉచితం. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కోసం ‘9505555020’ నంబర్లో సంప్రదించాలి.