‘పప్పు లోకేశ్‌.. నీకు నా సవాల్‌’ | ysrcp mla narayanaswami takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘పప్పు లోకేశ్‌.. నీకు నా సవాల్‌’

Aug 3 2017 3:23 PM | Updated on Oct 19 2018 8:10 PM

‘పప్పు లోకేశ్‌.. నీకు నా సవాల్‌’ - Sakshi

‘పప్పు లోకేశ్‌.. నీకు నా సవాల్‌’

ఉప ఎన్నికలో లబ్ధిపొందడం కోసం టీడీపీ నేతలు కులాల వారిగా విభజించి చిచ్చు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు.

నంద్యాల: ఉప ఎన్నికలో లబ్ధిపొందడం కోసం టీడీపీ నేతలు కులాల వారిగా విభజించి చిచ్చు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో మాలలు, మాదిగలను, బలిజను, ముస్లింలను విడదీస్తున్నారని మండిపడ్డారు. సొంత మామ నందమూరి తారక రామారావును దించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదని, అలాంటి ఆయనకు ప్రజలకు ఓ లెక్కా? అని అన్నారు.

ఇప్పుడు ఎన్నికలు పెడితే 140 సీట్లు వస్తాయని పప్పు అయిన పంచాయతీ రాజ్‌ మంత్రి లోకేష్‌ అంటున్నారని, ఇలాంటి మాటలు కట్టిపెట్టి ముందు దమ్మూ, ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేస్తేనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. భూమా అఖిలప్రియ వైఎస్‌ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలితే నంద్యాల ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని నారాయణ స్వామి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement