వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి భేటీ

YSRCP Meeting With Booth Level Activist In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. తాడేపల్లి ఆశ్రమం రోడ్డులోని ఓ ప్రైవేట్‌ గార్డెన్స్‌లో ఉదయం 10గంటలకు ఈ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ, మండల స్థాయి బూత్‌ కమిటీల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అవినీతిరహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలని కాంక్షించారు. గ్రామ సెక్రటేరియట్‌ నిర్మాణం జరుగుతుందని.. గ్రామ వాలెంటీర్లుగా చేయాలనుకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించండి అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాలో వీటి సంఖ్య 25 కాబోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు.

చదవండి : కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top