‘రేపో మాపో మళ్లీ జైలు కెళ్తావ్‌.. గుర్తుంచుకో’ | ysrcp leader sidha reddy takes on kandikunta vekata prasad | Sakshi
Sakshi News home page

‘రేపో మాపో మళ్లీ జైలు కెళ్తావ్‌.. గుర్తుంచుకో’

Published Mon, May 29 2017 10:09 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో సుమారు రూ. 9 కోట్ల నకిలీ డీడీల కుంభకోణంలో నువ్వు ఏ 2 ముద్దాయివి. నువ్వు నన్ను విమర్శించడమా’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌పై కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు.

కదిరి(అనంతపురం జిల్లా): ‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో సుమారు రూ. 9 కోట్ల నకిలీ డీడీల కుంభకోణంలో నువ్వు ఏ 2 ముద్దాయి. ఈ కేసులో నీకు జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల జరిమానా కూడా పడింది. శిక్షపడిన ఖైదీ నువ్వు విమర్శించడమా’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌పై కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ జయంతి సందర్బంగా ఆదివారం కందికుంట తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు ఘాటుగా స్పందించారు. మంగళవారం సిద్ధారెడ్డి తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడుతూ కందికుంటపై నిప్పులు చెరిగారు.

‘నన్ను మూడు పార్టీలు మారావని విమర్శించే ముందు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారారో వెళ్లి బాబునడుగు? కదిరి మున్సిపాలిటీతోపాటు అన్ని మండలాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని నీవు చెబుతున్నావ్‌. అందాకా ఎందుకు. మా పార్టీని వీడి మీ పార్టీలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేత రాజీనామా చేయించు. అప్పుడు మా పార్టీ తరపున నేను నిలబడతాను. మీ పార్టీ తరపున నువ్వు నిలబడతావో..లేక చాంద్‌బాషాను నిలబెడతారో తేల్చుకోండి. ఎవరు గెలుస్తారో తేలిపోతుంది’ అని సవాల్‌ విసిరారు. ‘ఎస్‌బీఐ డీడీల స్కాం కేసులో రేపో, మాపో మీరు మళ్లీ జైలుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే మీరు శిక్ష పడిన ఖైదీ. రాబోయే రోజుల్లో మీరు కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదన్న విషయం గుర్తుంచుకుంటే మంచిది’ అని హితవు పలికారు. నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు సేవచేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ టికెట్‌ రాకపోతే సొంత పార్టీ బలపరిచిన వ్యక్తిని ఓడించడానికి ఆయనలాగా రెబెల్‌గా పోటీ చేయలేదని, సొంత పార్టీ నేతలపై చెప్పులు విసరలేదు’ అని ఘాటుగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement