ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన | YS Jagan arrives in Tadepalli after concluding his 2-day visit | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Jun 16 2019 1:13 PM | Updated on Jun 16 2019 4:19 PM

YS Jagan arrives in Tadepalli after concluding his 2-day visit  - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లారు. కాగా వైఎస్‌ జగన్‌ నిన్న నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో విభజించిన రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నీతి ఆయోగ్‌ సమావేశంలో కోరారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement