పాపం.. పసివాళ్లు

Two Children become Orphans With Parents suicide - Sakshi

కుటుంబ కలహాలతో తల్లిదండ్రుల ఆత్మహత్య

కూడేరు: ఆ తల్లిదండ్రుల మనస్పర్థలు ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాయి. క్షణికావేశంతో వారు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. తల్లిదండ్రుల మృతదేహాలపై పడి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు డ్యామ్‌కు చెందిన ఈడిగ వాసు(30), నాగతేజ శ్వణి(27) ప్రేమించుకుని 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

వాసు పీఏబీఆర్‌ డ్యామ్‌ వద్ద ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగి. ఆరేళ్ల కుమారుడు జయవర్ధన్, నాలుగేళ్ల కుమార్తె మోక్షిత ఉన్నారు. శనివారం రాత్రి వాసు, నాగతేజశ్వణిలు భోంచేసి నిద్రించేందుకు వెళ్లారు. వాసు తల్లిదండ్రులు మరో ఇంట్లో నిద్రించారు. ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఉరేసుకుని కనిపించారు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top