తొలిరోజు ప్రశాంతం | tenth class exams | Sakshi
Sakshi News home page

తొలిరోజు ప్రశాంతం

Mar 28 2014 4:45 AM | Updated on Mar 21 2019 8:35 PM

జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాలను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, డీఈఓ చంద్రమోహన్‌లు తనిఖీ చేశారు.

 మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాలను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, డీఈఓ చంద్రమోహన్‌లు తనిఖీ చేశారు. ఉద యం 8.30గంటల వరకే విద్యార్థులు కేంద్రాల వ ద్దకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట వారి తల్లిదండ్రులు రావడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 250 కేంద్రాల్లో 47,210మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండ గా 46,972 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 238 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేటు 4684మంది విద్యార్థులకు 269మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని మాడల్‌బేసిక్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు.


 పరీక్ష ల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షలో ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాపీయింగ్‌ను ప్రొత్సహించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, 250 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు 12 ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు ప్రతిరోజు 5 నుంచి 6 కేంద్రాలను తనిఖీ చేస్తాయని కలెక్టర్ చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని, పరీక్షలు జరుగుతున్న రోజులు జిరాక్స్ కేంద్రాలన్నీ మూసి ఉంచాలని యజమానులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎవరైన అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

బాష్యం ఉన్నత పాఠశాలలో విజయసాయి అనే విద్యార్థిని నామినల్‌రోల్ లేదంటూ అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతివ్వక పోవడంతో విద్యార్థి తలి ్లదండ్రులు ఆందోళనకు దిగారు. విషయం డీఈఓ దృష్టికి వెళ్లడంతో ఆయన కేంద్ర వద్దకు వచ్చి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.జిల్లావ్యాప్తంగా జరిగిన మొదటి రోజు పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ చంద్రమోహన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement