మీడియా ప్రతినిధుల పట్ల విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరును జర్నలిస్టు సంఘాలు, నాయకులు ఖండించారు.
హైదరాబాద్: మీడియా ప్రతినిధుల పట్ల విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరును జర్నలిస్టు సంఘాలు, నాయకులు ఖండించారు. పాత్రికేయులపై లగడపాటి వాడిన పదజాలం సముచితం కాదని సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన చాలా పరుషంగా మాట్లాడారని పేర్కొన్నారు. లగడపాటి వాడిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
లగడపాటి అనుచిత పశ్చిమగోదావరి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కె. మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి వినాయకరావు వ్యాఖ్యలను ఖండించారు. నోరు జారి మాట్లాడిన లగడపాటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లగడపాటి వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు మెదక్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.