వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో మూడవ రోజైన సోమవారం
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో మూడవ రోజైన సోమవారం కూడా సాగనుందని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మూడవ రోజు ఉదయం వి.కోట సమీపంలోని పట్రపల్లి నుంచి సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమవుతుందన్నారు. వి.కోట నుంచి దొడ్డిపల్లె, నెర్నపల్లె, మద్దిరాల, కృష్ణాపురం, దానవయ్యగారి పల్లె, కుమార మడుగుల మీదుగా కస్తూరి నగరం చేరకుంటుంది. అక్కడి నుంచి కైగల్, దేవదొడ్డి నుంచి బెరైడ్డిపల్లెకు యాత్ర చేరుకుంటుందని తెలిపారు. అక్కడ దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు.