పదో తరగతి పరీక్షలలో చిట్టచివరి పరీక్ష మంగళవారం జరుగుతోంది. ఈ పరీక్ష రాయడానికి వెళ్తున్న ఓ బాలికను కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
పదో తరగతి పరీక్షలలో చిట్టచివరి పరీక్ష మంగళవారం జరుగుతోంది. సోషల్ రెండో పేపర్ రాసేస్తే ఇక పరీక్షలు అయిపోతాయి. మరో రెండు నెలల్లో కాలేజీకి వెళ్లిపోవచ్చని ఆ చిన్నారి అనుకుంది. అంతలోనే కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆమె ప్రాణాలు బలిగొంది. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టుపూడివలస వద్ద సంభవించింది.
పదోతరగతి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్న ఓ విద్యార్థినిని కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే పోలీసులు మాత్రం కారును వదిలేశారంటూ పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలం వద్దకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు తరిమికొట్టారు.