రూ. 30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం | ganja caught in vishaka patnam | Sakshi
Sakshi News home page

రూ. 30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Aug 3 2015 12:51 PM | Updated on Sep 3 2017 6:43 AM

అక్రమంగా గంజాయి తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాడిమిల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా మాడిమిల్లి మండలం మద్దులూరు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అడవిలో తనిఖీలు చేపట్టారు. అది గమనించిన  దుండగులు గంజాయి మూటలను వదిలి పరారయ్యారు.  స్వాధీనం చేసుకున్న 40 గంజాయి బస్తాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఏఎస్పీ ఫకిరప్ప సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement