కల్లు చెట్ల కోసం ఘర్షణ: ఐదుగురి మృతి | Sakshi
Sakshi News home page

కల్లు చెట్ల కోసం ఘర్షణ: ఐదుగురి మృతి

Published Wed, Apr 2 2014 9:12 AM

five died in clash for toddy in east godavari

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఇజ్జలూరు గ్రామంలో కల్లు గీసుకునే చెట్ల మీద హక్కు కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు గిరిజనులు మరణించారు. ఇది పూర్తిగా గిరిజన గ్రామం. ఈడిగ కల్లు చెట్లకు సంబంధించి గిరిజనుల మధ్య గత నాలుగైదు రోజులుగా జరుగుతోంది. మద్యం మత్తులో ఉండటంతో రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణ కారణంగా రెండు వర్గాలకు చెందినవాళ్లు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా ఒక్కో చెట్టు నుంచి 50-100 లీటర్ల వరకు కల్లు వస్తుంది. ఇది మార్కెట్లో లీటర్ 15 రూపాయల వరకు అమ్ముతారు. రంపచోడవరం తీసుకొచ్చి ఈ కల్లము అమ్ముకుంటారు. వేసవి కాలం కావడంతో ఈ కల్లుకు డిమాండ్ కూడా ఎక్కువ. అందుకే ఈ ఘర్షణ జరిగిందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement