తొలి రోజు 15.22 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు

First day free goods for above 15 lakh families - Sakshi

ఏడో విడత ఉచిత సరుకుల పంపిణీ ఉదయం 6 గంటలకే ప్రారంభం

శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే బయోమెట్రిక్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7వ విడత ఉచిత సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. లాక్‌ డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం కార్డులో పేరున్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇచ్చారు.

కరోనా కారణంగా రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుమిగూడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే.. లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్నారు. ఇందుకు అవసరమైన శానిటైజర్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఏడో విడత ఉచిత సరుకులను మొదటి రోజైన శుక్రవారం 15,22,822 కుటుంబాల వారు తీసుకున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top