రైతులు కష్టాల్లో ఉన్నారు | Farmers are in trouble : Shilpa Chakrasani Reddy | Sakshi
Sakshi News home page

రైతులు కష్టాల్లో ఉన్నారు

Published Sun, Dec 31 2017 11:41 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ఆత్మకూరు: రైతులు కష్టాల్లో ఉంటే వేడుకలు చేసుకోవడం మంచిదికాదని, 2018 నూతన సంవత్సర సంబరాలకు తాను దూరంగా ఉంటానని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి శనివారం ఓ ప్రకటన  విడుదల చేశారు. రాష్ట్రంలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అప్పుల్లో కూరుకుపోవడంతో వారికి సంఘీభావంగా నిలవాలని  ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 అంతేకాక రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తానన్నారు. భవిష్యత్‌లో రైతుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాలు, ఆందోళనలు చేసి అండగా నిలుస్తామన్నారు. అంతేకాక ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించిన విధంగా తమ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతిగా ఉంటుందని, రైతులెవరూ ఆధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement