ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం | andhra pradesh and telangana assemblies to meet at same time | Sakshi
Sakshi News home page

ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం

Feb 27 2015 4:18 PM | Updated on Sep 2 2017 10:01 PM

ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం

ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం

చరిత్రలో ఒకేసారి ఒకే అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

చరిత్రలో ఒకేసారి ఒకే అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ముందుగా వచ్చేనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్ల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నారు.

గేట్-1 నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను అనుమతించాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే గేట్-2 నుంచి రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతించాలని భావించారు. ఇలా ఇప్పటివరకు ఎప్పుడూ ఒకేసారి ఒకే సమయంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే భవనంలో జరిగిన దాఖలాలు లేవు.

Advertisement
 
Advertisement
Advertisement