చిత్తూరు జిల్లాలో 79 మంది స్మగ్లర్లు అరెస్ట్ | 79 Smugglers arrested in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో 79 మంది స్మగ్లర్లు అరెస్ట్

Nov 28 2014 8:30 AM | Updated on Oct 22 2018 1:59 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి తిరుపతికి వాహనంలో తరలిస్తున్న దాదాపు 79 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్కు తరలించి ప్రశ్నించగా... తాము ఎర్రచందనం స్మగ్లర్లమని వారు వెల్లడించారని పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా వాహనం డ్రైవర్ను ప్రశ్నించగా... అతను పొంతనలేని సమాధానాలు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. దాంతో ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement