సైనిక్‌, నవోదయ ప్రవేశాలకు చాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

సైనిక్‌, నవోదయ ప్రవేశాలకు చాన్స్‌

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

తిరుపతి అర్బన్‌: సైనిక్‌ స్కూల్‌తోపాటు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విశ్వం స్కూల్‌లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులకు అవకాశం లభించినట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విశ్వనాథ్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం స్కూల్‌లో ఆయన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులతో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సైనిక్‌ స్కూల్‌కు 59 మంది విద్యార్థులు, నవోదయ విద్యాలయాలకు 63 మంది పిల్లలు ప్రవేశాలు జరగుతున్నాయని వివరించారు. 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైనిక్‌, నవోదయ విద్యాలయాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

జానపద సంబరం

నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని అమీర్‌షావలీ దర్గా ఆవరణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదివారం రాత్రి జానపద సంబరాలు అంబరాన్నంటాయి. భాష సాంసృతిక శాఖ వారి సౌజన్యంతో తిరుపతి సేవా సదన్‌ వారి సారథ్యంలో ప్రజలను చైతన్య పరుస్తూ జానపద కళా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక జీడీ డ్యాన్స్‌ ఇన్‌స్టూట్‌, తిరుపతి శ్రీ అకాడమి, శ్రీకాళహస్తి నాగరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement