అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు పాదరక్షణ సమస్య తలెత్తుతోంది. భద్ర పరిచే అవకాశం లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వదిలేయాల్సి వస్తోంది. లగేజీ కౌంటర్లలో ఇతర వస్తువులను మాత్రమే తీసుకుంటూ ఉండడంతో వేసుకువచ్చిన చెప్పులను అలాగే విడిచిపెట్టేయాల్సి పరిస్థితి ఏర్పడింది. నిత్యం వేలాది మంది మెట్ల మార్గం గుండా శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు.ఈ క్రమంలో బ్యాగులు, ఇతర సామగ్రితోపాటు పాదరక్షలను సైతం పెట్టుకునేందుకు కనీసం స్టాండ్ అయినా ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. తిరుగు ప్రయాణంలో తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
– అన్నమయ్యసర్కిల్


