ఫుట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఆదివారం జిల్లా ఫుట్‌బాల్‌ జట్లును ఎంపిక పోటీ లు నిర్వహించారు. అండర్‌–13, 15 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు దాదాపు 250మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. శాప్‌, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కోచ్‌లు వినోద్‌, రమేష్‌, బాషా పర్యవేక్షణలో పోటీలను చేపట్టారు. ఎంపికై న జట్లు మదనపల్లె నిర్వహించనున్న అండర్‌–15 రాష్ట్ర స్థాయి బాలుర ఫుట్‌బాల్‌, అనంతపురంలో నిర్వహించే అండర్‌–15 రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్‌, అలాగే ఎన్‌టీఆర్‌ జిల్లాలో నిర్వహించే అండర్‌–13 రాష్ట్ర స్థాయి బాలుర ఫుట్‌బాల్‌, నంద్యాలలో నిర్వహించే అండర్‌–13 రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు. క్రీడాకారులను ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప, ఉపాధ్యక్షుడు గుండ్లూరు వెంకటరమణ, సభ్యుడు అచ్యుత్‌ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement