తెలంగాణ పోలీసులకు శుభవార్త | Telangana Police get leave on birthdays and marriage anniversary for all ranks | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసులకు శుభవార్త

Apr 27 2026 8:50 PM | Updated on Apr 27 2026 9:25 PM

Telangana Police get leave on birthdays and marriage anniversary for all ranks

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులకు శుభవార్త. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు.

అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement