‘ప్లేట్‌’ ఫిరాయించారు.. దొరికిపోయారు! | Raidurgam traffic police bike without number plate case | Sakshi
Sakshi News home page

‘ప్లేట్‌’ ఫిరాయించారు.. దొరికిపోయారు!

Apr 26 2026 6:14 AM | Updated on Apr 26 2026 6:14 AM

Raidurgam traffic police bike without number plate case

మ్యాగ్నెట్‌ కారణంగా ఇలా కనిపించకుండా..

గచ్చిబౌలి: నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా మాగ్నెట్‌ అమర్చిన ఓ బైకిస్ట్‌ రాయదుర్గం ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. సైనిక్‌పురికి చెందిన కమ్రాన్‌ (28) ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఓ నిర్మాణ సంస్థలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. శనివారం బైక్‌పై వెళ్తుండగా ముందు వైపు నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో బయోడైవర్సిటీ వద్ద రాయదుర్గం ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. వెనక వైపు బైక్‌ టీఎస్‌ 07ఈఈకే9777 నంబర్‌ ప్లేట్‌ ఉంది. ఎస్‌ఐ నాగరాజు బైక్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. వెనక నంబర్‌ ప్లేట్‌కు కమ్రాన్‌ మాగ్నెట్‌ (అయస్కాంతం) అమర్చాడు. అవసరమైనప్పుడు నంబర్‌ ప్లేట్‌ పైకి వెళ్తుంది. దీంతో వెనక నంబర్‌ ప్లేట్‌ కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకుంటున్నాడు.  రాయదుర్గం లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌ఓ పవన్‌ తెలిపారు.  

ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకోవాలని.. 
గోల్కొండ: ట్రాఫిక్‌ చలానాలతో పాటు ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనానికి నకిలీ రిజి్రస్టేషన్‌ నంబర్‌ ప్లేట్‌ను బిగించిన మహమ్మద్‌ మోహినుద్దీన్‌ను శనివారం ట్రాఫిక్‌ పోలీసుల పట్టుబడ్డాడు. టోలిచౌకీ–గచి్చబౌలి రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో యాక్టివా వాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపి ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయగా.. ఆర్‌సీలో వాహన నంబర్‌ టీఎస్‌12ఈఆర్‌2466 ఉండగా.. నంబర్‌ ప్లేట్‌పై టీఎస్‌11ఈయూ5327 అని ఉంది. షేక్‌ రియాజ్‌ అనే వ్యక్తి నుంచి వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మహమ్మద్‌ మోహినుద్దీన్‌ వివరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నట్లు టోలిచౌకీ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రమేష్‌నాయక్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement