ఎంఐఎం నేత హన్నుద్దీన్‌ మృతి 

MIM Leader Shaik Hunnuddin Passes Away At 56 Hyderabad - Sakshi

వెంగళరావునగర్‌/హైదరాబాద్‌: ఎంఐఎం సీనియర్‌ నాయకుడు షేక్‌ హన్నుద్దీన్ ‌(56) మృతిచెందారు. గురు వారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందినట్లు అతడి మిత్రులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎల్లారెడ్డిగూడలో శుక్రవారం ఆయన మృతదేహాన్ని ఎమ్మెల్యేలు పాషా, మాగంటి, నాయకులు నగేష్, జాఫర్‌ తదితరులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం షేక్‌ హన్నుద్దీన్‌ అంత్యక్రియలు జరిగాయి. 
(చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top