రైతు కంట కన్నీరు.. కళ్ల ముందే కష్టం బుగ్గిపాలు | Maize Crop Gutted Fire In Nirmal District | Sakshi
Sakshi News home page

రైతు కంట కన్నీరు.. కళ్ల ముందే కష్టం బుగ్గిపాలు

Apr 30 2026 3:34 PM | Updated on Apr 30 2026 3:56 PM

Maize Crop Gutted Fire In Nirmal District

నిర్మల్‌ జిల్లా: మండల కేంద్రం పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్‌ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్‌, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్‌ కుమార్‌, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కాలి బూడిదయ్యింది.

విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాస్‌ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్‌ఐ శ్రావణ్‌ రెడ్డి, ఏఈవో నాగమణి, జీపీవో భాస్కర్‌ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు.

మాలేగాంలో..
కుభీర్‌: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు.

స్పందించిన సీఎం..
షార్ట్ సర్క్యూట్ కారణంగా నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయి రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని.. ఆర్థిక సహాయం అందించాలని సీఎం..  సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement