రేవంత్‌ను సీఎం చేసింది నేనే: మ‌ల్లారెడ్డి | Chamakura Malla Reddy Chit Chat: I made Revanth Reddy CM | Sakshi
Sakshi News home page

రేవంత్ ప‌వ‌ర్‌ఫుల్‌ నాయకుడు: మ‌ల్లారెడ్డి

Mar 23 2026 1:23 PM | Updated on Mar 23 2026 2:25 PM

Chamakura Malla Reddy Chit Chat: I made Revanth Reddy CM

సాక్షి, హైద‌రాబాద్‌: రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది తానేన‌ని మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామ‌కూర‌ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న‌స‌భ లాబీలో సోమ‌వారం మీడియా ప్ర‌తినిధులతో ఆయ‌న చిట్‌చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ''రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ తప్ప ప‌వ‌ర్‌ఫుల్‌ నాయకుడు ఎవరూ లేరని రెడ్డి సంఘం మీటింగ్‌లో నేనే చెప్పాను. ఎవరు అవునన్నా కాదన్నా నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేన‌''ని మ‌ల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ క్యారెక్టర్ త‌న‌దేన‌ని మ‌ల్లారెడ్డి వెల్ల‌డించారు. దర్శకుడు హరీష్ శంకర్ విలన్ పాత్ర చేయ‌మ‌ని త‌న‌ను అడిగితే నో చెప్పానని అన్నారు. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉందంటూ త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు.

విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ
మల్లారెడ్డి వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స‌ర‌దాగా స్పందించారు. ''మల్లారెడ్డి నువ్వు విలన్ పాత్రకే సెట్ అవుతావు. నువ్వు సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చెయ్. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ'' అంటూ త‌ల‌సాని హాస్య‌మాడారు. దీంతో అక్క‌డ నవ్వులు విరిశాయి. కాగా, ఇటీవ‌ల 50వ పెళ్లిరోజు మ‌ల్లారెడ్డి ఘ‌నంగా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. 

చ‌ద‌వండి: దానం నాగేంద‌ర్‌కు హైకోర్టు నోటీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement