హైదరాబాద్: శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వటువులకు 14వ వేసవి సంధ్యావందన శిక్షణ శిబిరం(రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపు) నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 17 వరకు హైదరాబాద్, కుంట్లూరులోని శ్రీ వేద వ్యాస పాఠశాలలో దీన్ని నిర్వహిస్తారు. పేర్లు నమోదు చేసుకునేందుకు http://www.sjssstrust.org వెబ్‌సైట్ చూడొచ్చు. మరిన్ని వివరాలకు 9704706667, 8008391458కు ఫోన్ చేయొచ్చు.
24వ ఆరాధన మహోత్సవాలు
జగద్గురువుల పరంపరలో వెలిగిన మహానుభావులు పరమహంస పరివ్రాజక చార్యులు శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి 24వ ఆరాధన మహోత్సవాలు కుంట్లూరు శ్రీ వేదవ్యాస పాఠశాలలో శనివారం నుంచి సోమవారం (ఏప్రిల్ 20) వరకు జరుగుతాయి. ఈ పుణ్య సమయములో వేదఘోషల మధ్య గణపతి పూజ, ఉపనిషత్ పారాయణులు, వేదపారాయణ, గురుపూజ, విద్వత్ సదస్సు, అన్నదానం వంటి వైదిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
విశిష్ట కార్యక్రమము
విద్యారణ్య, శాస్త్ర సదస్సు: వేద శాస్త్రముల ఆంతర్యాన్ని ప్రతిపాదించే ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి ప్రముఖ పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని తమ పుణ్య సందేశాలను అందించనున్నారు. గౌరవనీయులు, ప్రతిష్ఠాత్మక అతిథులు హాజరుకానున్న ఈ మహోత్సవములో ప్రతి భక్తుడు పాల్గొని సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందొచ్చు. భక్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ట్రస్ట్ ఆహ్వానం పలికింది.


