గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్‌ రికార్డు

14th Guinness Record To GITAM Alumni - Sakshi

పటాన్‌చెరు: గీతం యూనివర్సిటీ పూర్వ విద్యా ర్థిని శివాలి జోహ్రి గిన్నిస్‌ రికార్డు సాధించారు. కాగితంతో పూలు, ఇతర ఆకృతులను క్విల్లింగ్‌ ప్రక్రియలో చేసి ఆమె ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే 13 గిన్నిస్‌ రికార్డులు, 15 అసిస్ట్‌ రికార్డులు సాధించిన శివాలి తాజాగా 2020 ఏడాదికి గాను 14వ గిన్నిస్‌ రికార్డ్‌ సాధించారు. 2016–17 విద్యా సంవ త్సరంలో గీతం యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి పది యూనిక్‌ వరల్డ్‌ రికార్డులు కూడా పొందారు.

ఆమె రికార్డులను గీతం యూనివర్సిటీ వారు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు పంపిస్తూ వచ్చారు. తొలిసారిగా ఆమె నిర్ణీత సమ యంలో తన తల్లి కవిత జోహ్రి కలిసి 1,251 విభిన్న ఆకృతుల్లో కాగితపు బొమ్మలను తయా రు చేసి రికార్డు సృష్టించారు. తాజాగా 2,342 బొమ్మలను తయారు చేసి గీతంలో ప్రదర్శిం చారు. శివాలి మరోసారి గిన్నిస్‌ రికార్డు సాధించడంపై గీతం యాజమాన్యం హర్షం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా యాజ మాన్య ప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top