ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన | South Africa Announce A Squad For Key Series Against England Lions | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన

Apr 30 2026 7:42 PM | Updated on Apr 30 2026 8:15 PM

South Africa Announce A Squad For Key Series Against England Lions

త్వరలో ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మార్క్వెస్‌ అకెర్మన్‌ ఎంపిక కాగా.. పలువురు జాతీయ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

సౌతాఫ్రికా-ఏ జట్టు మే 22 నుంచి జూన్‌ 9 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, మూడు అనధికారిక వన్డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.  ఈ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టు మే 16న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది.

ఈ పర్యటనలో తొలుత నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి. మే 22-25 వరకు అరండల్‌ వేదికగా తొలి మ్యాచ్‌, మే 29-జూన్‌ 1 వరకు బెకెన్హమ్‌ వేదికగా రెండో మ్యాచ్‌ జరుగనున్నాయి.

అనంతరం జూన్‌ 5న లీసెస్టర్‌ వేదికగా తొలి వన్డే, జూన్‌ 7న వార్సెస్టర్‌ వేదికగా రెండో వన్డే, జూన్‌ 9న వార్సెస్టర్‌ వేదికగా మూడో వన్డే జరుగనున్నాయి.

నాలుగు రోజుల మ్యాచ్‌లకు సౌతాఫ్రికా-ఏ జట్టు..
మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, జుబైర్ హమ్జా, జోర్డన్ హెర్మన్, రూబిన్ హెర్మన్, న్కోబాని మొకోయెనా, డేన్ ప్యాటర్సన్, సినేతెంబా క్వెషిలే, లెసెగో సెనోక్వానే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్, టియాన్ వాన్ వూరెన్, కోడి యూసఫ్.

వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా-ఏ జట్టు..
మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, Gerald Coetzee, టోనీ డి జోర్జి, కానర్ ఎస్టర్‌హుయిజెన్, డియాన్ ఫోరెస్టర్, బ్జోర్న్ ఫోర్టుయిన్, రూబిన్ హెర్మన్, క్వేనా మఫాకా, న్కోబాని మొకోయెనా, న్కాబా పీటర్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, సినేతెంబా క్వెషిలే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్.
 

Advertisement
 
Advertisement
Advertisement