డ్రగ్స్‌ టెస్ట్‌లో దొరికిపోయిన పాక్‌ క్రికెటర్‌ | Pakistan Player Caught Taking Drugs In T20 World Cup, Investigation Launched, Contract Cancelled | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ టెస్ట్‌లో దొరికిపోయిన పాక్‌ క్రికెటర్‌

Apr 22 2026 3:46 PM | Updated on Apr 22 2026 3:57 PM

Pakistan Player Caught Taking Drugs In T20 World Cup, Investigation Launched, Contract Cancelled

పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ మొహమ్మద్‌ నవాజ్‌ డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలాడు. ఈ వ్యవహారంపై పాక్‌ క్రికెట్‌ బోర్డు విచారణ ప్రారంభించింది. నవాజ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. నవాజ్‌ ఇటీవల ముగిసిన టీ20 ‍ప్రపంచకప్‌లో డ్రగ్స్‌ వాడినట్లు నిరూపితమైంది. 

ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లతో పర్వాలేదనిపించాడు. నవాజ్‌ రాణించినా, ప్రపంచకప్‌లో పాక్‌ ఘోరంగా విఫలమై సూపర్‌-8 దశలోనే ఇంటిముఖం పట్టింది. పీసీబీ విచారణలోనూ నవాజ్‌ నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శాశ్వత నిషేధం అదనంగా భారీ జరిమానా విధించవచ్చు.

కాగా, క్రికెట్‌లో డ్రగ్స్ వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వినోదం కోసం అయినా నిషేధిత పదార్థాలు వాడితే తీవ్ర శిక్షలు తప్పవు. ఈ ఘటన మరోసారి క్రికెట్‌లో క్రమశిక్షణ, ప్రొఫెషనల్ ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement