తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! | Jason Holder Extracts Revenge On Virat Kohli, RCB Star Fumes Video Viral | Sakshi
Sakshi News home page

అక్కడ తప్పించుకుని.. ఇక్కడ దొరికేసిన కోహ్లి! వీడియో

Apr 25 2026 11:04 AM | Updated on Apr 25 2026 11:35 AM

Jason Holder Extracts Revenge On Virat Kohli, RCB Star Fumes Video Viral

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్‌ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్‌ను ప్యాడ్‌కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ గుజరాత్‌ తలపడ్డాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.

‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్‌! 
ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఆర్సీబీ స్టార్‌ జాకబ్‌ బెతెల్‌ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్‌ మిడ్‌వికెట్‌ వద్ద వాషింగ్టన్‌ సుందర్‌ సునాయాస క్యాచ్‌ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్‌ భారీ మూల్యం చెల్లించింది.

మరో ఎండ్‌లో పడిక్కల్‌ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన అతను సిరాజ్‌ ఓవర్లో మరో సిక్స్‌ కొట్టాడు. 

రషీద్‌ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టగా... ప్రసిధ్‌ ఓవర్లో పడిక్కల్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. ఆపై రషీద్‌ ఓవర్లోనూ 2 సిక్స్‌లతో చెలరేగిన పడిక్కల్‌ 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.

హోల్డర్‌ వైల్డ్‌గా సెలబ్రేషన్స్‌..  తీవ్ర అసంతృప్తిలో కోహ్లి
పడిక్కల్‌ను రషీద్‌ అవుట్‌ చేయగా, హోల్డర్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్‌ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్‌కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్‌ శర్మ (10), కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (8) విఫలమైనా... కృనాల్‌ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (10 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు. 

చదవండి: అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్నాం: కేకేఆర్‌ మాజీ కోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement