ఆస్ట్రేలియా ప్లేయర్‌ షాకింగ్‌ నిర్ణయం | Australian Player To Join Shocking Newbie International Team, More Players In Line | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ప్లేయర్‌ షాకింగ్‌ నిర్ణయం

Apr 9 2026 4:40 PM | Updated on Apr 9 2026 5:03 PM

Australian Player To Join Shocking Newbie International Team, More Players In Line

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మోసస్‌ హెన్రిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో అతను ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్‌కు వలస వెళ్లనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పోర్చుగల్‌ క్రికెటర్‌ సిరాజ్‌ ఉల్లా ఖదెమ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లీక్‌ చేశాడు. త్వరలో మన జట్టులో ఓ బిగ్‌బాష్‌ లీగ్‌ ప్లేయర్‌ జాయిన్‌ కాబోతున్నాడని హింట్‌ ఇచ్చాడు.

హెన్రిక్స్‌ పోర్చుగల్‌కు మకాం మార్చడానికి ఓ ప్రధాన కారణముంది. అతనికి ఆస్ట్రేలియా జట్టు తరఫున అవకాశాలు రావడం లేదు. స్టోయినిస్‌, మిచెల్‌ మార్ష్‌ వంటి ఆటగాళ్ల వల్ల అతని అవకాశాలు కనుమరుగయ్యాయి. పైగా అతని వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతనికి అడ్డంకిగా మారింది. దీంతో అతను తన స్వస్థలమైన పోర్చుగల్‌కు మారాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. హెన్రిక్స్‌కు ఆస్ట్రేలియాతో పాటు పోర్చగల్‌ పౌరసత్వం కూడా ఉంది.

హెన్రిక్స్‌ 1989లో పోర్చుగల్‌లో జన్మించాడు. అతడి తండ్రి ఆల్వారో ఓ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌. చిన్న వయసులోనే హెన్రిక్స్‌ కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2013లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హెన్రిక్స్‌ 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన హెన్రిక్స్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 636 పరుగులు చేసి, 17 వికెట్లు సాధించాడు.  

బిగ్‌బాష్‌ లీగ్‌లో హెన్రిక్స్‌కు ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. సిడ్నీ సిక్సర్స్‌ తరఫున 3324 పరుగులు చేసి, రెండు టైటిల్స్‌ (2019/20, 2020/21) గెలిపించాడు.  

అసోసియేట్‌ దేశాలు అంతర్జాతీయ క్రికెట్‌లో బలంగా ఎదుగుతున్న తరుణంలో హెన్రిక్స్‌ లాంటి ఆటగాడు పోర్చుగల్‌కు వలస వెళ్లడం ఆ దేశ క్రికెట్‌ తలరాతనే మార్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ లాంటి చిన్న జట్టు అద్భుతాలు చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్శించిన విషయం విధితమే.

అసోసియేట్‌ జట్లలో చేరిన ప్రముఖ క్రికెటర్లు
- ఉన్ముక్త్‌ చంద్‌ (భారత్‌) – యూఎస్‌ఏ  
- రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వే – నెదర్లాండ్స్‌  
- కోరె ఆండర్సన్‌ – యూఎస్‌ఏ  
- డేవిడ్‌ వీస్‌ – నమీబియా  
- వేన్‌ మాడ్సన్‌ – ఇటలీ  
- రాస్‌ టేలర్‌ – సమోవా  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement