పేదల కల నిజం చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల కల నిజం చేయడమే లక్ష్యం

Jun 4 2026 9:25 AM | Updated on Jun 4 2026 9:25 AM

పేదల కల నిజం చేయడమే లక్ష్యం ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పీహెచ్‌సీ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో ● పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట(వేములవాడ): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మర్తనపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీడీవో స్నిగ్ధ, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచులు బోయిని దేవరాజు, దీపిక, ఉప సర్పంచ్‌ బోనాల పునీత్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, డీసీసీ కార్యదర్శి షేక్‌ ఫిరోజ్‌పాషా, మండలాధ్యక్షుడు సత్యం, సింగిల్‌విండో చైర్మన్‌ బండ నర్సయ్య, నాయకులు ఐదరి శ్రీనివాస్‌, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

గంభీరావుపేట(సిరిసిల్ల): లింగన్నపేట పీహెచ్‌సీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రజిత తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వ్యాధి నిరోధక టీకాల మందులను పరిశీలించి సరైన మోతా దు, నిర్దేశిత కాలంలో వేయడంతోపాటు టీకా తీసుకున్న తర్వాత స్వల్పంగా జ్వరం రావడం, తీసుకున్న ప్రాంతంలో చర్మం ఎర్రబడడం, వాపు లాంటివి సంభవిస్తాయని, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల ఆధికారి సంపత్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజ్‌కుమార్‌, వైద్యాధికారి వినయ్‌కుమార్‌, సీహెచ్‌వో రమేశ్‌ తదితరులున్నారు.

చిన్నారులకు సకాలంలో

టీకాలు వేయించాలి

ముస్తాబాద్‌: చీకొడు, గూడెం, ఆవునూర్‌ ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రికార్డులను పరిశీలించారు. 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని సూచించారు. టీకా తీసుకున్నాక చిన్నారుల్లో వచ్చే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ వైద్య పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలున్నారు.

ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం

సిరిసిల్లటౌన్‌: ప్రజా సంక్షేమ పాలనే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని జాతీయ నాయకుడు మురళీధర్‌రావు పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలోని వాసవి కల్యాణ మంటపంలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచ వేదికపై విశిష్ట స్థానాన్ని సంపాదించిందన్నారు.

2 రోజుల శిక్షణ శిబిరం

సిరిసిల్లలో ప్రశిక్షణ శిబిరం 2 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. పార్టీ సిద్ధాంతం, పార్టీ చరిత్ర, వికాసం, భారత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల బాధ్యతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్‌ మీడియా వినియోగం, సమర్థవంతమైన ప్రజా సంబంధాలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులు, పార్టీ సీనియర్‌ నాయకులు శిక్షణ అందిస్తారన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌రావు, కరీంనగర్‌ పార్లమెంటు కోకన్వీనర్‌ ఆడెపు రవీందర్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement