తాడేపల్లి: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరోసారి స్పష్టం చేశారు. జగన్ పాలనలో మహిళలకు ‘గోల్డెన్ పిరియడ్’ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
‘జగన్ పాలనలో మహిళల భద్రత కోసం దిశ చట్టం, యాప్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. ప్రతి పథకంలో మహిళలకే ప్రాధాన్యం. అమ్మ ఒడి, చేయూత, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉదాహరణలు. స్థానిక సంస్థల్లో 50% కంటే ఎక్కువగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది. మహిళా బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యలు అభ్యంతరకరం.
కూటమి పాలనే మహిళలకు డార్క్ పిరియడ్. సాక్షాత్తు ఎంపీగా ఉన్న శబరినే సీఎంవో అధికారి అవమాస్తే సీఎం చంద్రబాబు ఖండించలేదు. మహిళలపై అవమానకర వ్యాఖ్యల చేసిన చరిత్ర టీడీపీదే. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబును మహిళా ఎంపీ శబరి నిలదీయాలి. సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తున్నది టీడీపీనే. మహిళల గౌరవం గురించి మాట్లాడే ముందు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


