పాలన చేతకాకపోతే తప్పుకోండి!

Telangana: MLA Etela Rajender Fires On CM KCR - Sakshi

సీఎంపై ఈటల రాజేందర్‌ ఫైర్‌  

కొల్లాపూర్‌ రూరల్‌: ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే తప్పుకోవా లని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్ర భుత్వంపై సీఎం కేసీఆర్‌ అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులనుంచి ధాన్యం కొనుగోలుకు రూ.500 కోట్లు కూడా వెచ్చించలేరా? అని ప్రశ్నించారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన పా ల్గొన్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడు తూ శాంతిభద్రతలు కాపాడటంలో సీఎం విఫ లమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు కాల్చడం, చావుడ ప్పులు కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరుపుతూనే తమ తప్పు లు కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం సిగ్గుచేట న్నారు.

రైతులు ప్రగతిభవన్‌ ఎదుట కేసీఆర్‌ బొమ్మను తగులబెట్టి చావుడప్పు కొట్టాలన్నా రు. దళితులకు మూడెకరాల భూమి, సబ్సిడీ రుణాలు ఇవ్వనందుకు చావుడప్పు కొట్టాల న్నారు. ప్రగతిభవన్‌కు ఇనుప కంచెలు వేసుకు న్నారని, మంత్రులకు అధికారాలు లేకుండా చేశారని ఈటల విమర్శించారు. సమావేశంలో బీజేపీ నేతలు బంగారు శృతి, సుధాకర్‌రావు, దిలీప్‌చారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top