సై అంటే సై.. నాయకుల సోషల్‌ యుద్ధం

Sircilla: Political Leaders War in Social media - Sakshi

సాక్షి,వేములవాడ: రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రమేశ్‌బాబు ‘వంద పడకలే కాదు.. వంద సమాధానాలు’ అంటూ సామాజిక మధ్యమంలో కరపత్రం పోస్టు చేశారు. దీంతో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ ‘ఈ ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పండి’ అని మరో కరపత్రం పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీరి ప్రచారం చర్చనీయాంశంగా మారింది. 

కాగా వేములవాడ శివారులోని తిప్పాపూర్‌లో రూ.22.50 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోందన్నారు. ఇటీవల చేపట్టిన సర్వేలో 3,900 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలిందని, వారిని గుర్తించి కిట్లు అందించామని తెలిపారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంతో వేములవాడ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు దరి చేరాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 50పడకలతో కోవిడ్‌–19 సేవలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు.

చదవండి: ఒక్క చాన్స్‌.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top