ఢిల్లీ: బీజేపీ తలపెట్టిన ఆపరేషన్ లోటస్ సక్సెస్ అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పది మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురుని బీజేపీ ఆకర్షించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా,అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. ఏడుగురు ఎంపీలు వీడడంతో ఆప్ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా ప్రకటించిన రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్ సమక్షంలో బీజేపీలో చేరారు. మిగిలిన నలుగురు ఎంపీలు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీలు ఉన్నారు. వారి ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత లేదు. అయితే, ఆ నలుగురు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్‌కు రాజీనామా వార్తలతో ఆ నలుగురు ఎంపీలతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుబాటులోకి రాలేదని సమాచారం.
మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ లక్ష్యంగా బీజేపీ భారీ ‘ఆపరేషన్ లోటస్’కు శ్రీకారం చుట్టింది. గతంలో పంజాబ్ ఇంఛార్జిగా పని చేసిన రాఘవ్ చద్దాను ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పక్కన బెట్టారు. ఈ అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.అదే సమయంలో కమలం నేతలు రాఘవ్ చద్దా ద్వారా ఆప్‌లో చీలిక తెచ్చింది.
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్‌లో బీజేపీ అధికారంలోకి రావాలని పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. మొన్నటి దాకా అకాలీ దళపై ఆధారపడ్డ బీజేపీ..ఇక నుంచి పంజాబ్‌లో సొంతంగా ఎదగాలని దూకుడుగా వెళ్తోంది.
Today, exercising the provisions of the Constitution of India, more than two-thirds of the AAP MPs in the Rajya Sabha have merged with the BJP.
Seven MPs have signed the document, which was submitted to the Hon’ble Chairman of the Rajya Sabha.
I, along with two other MPs,…— Raghav Chadha (@raghav_chadha) April 24, 2026


