మెడికోలు, ప్రొఫెసర్లు ఫుడ్ పాయిజన్‌కు గురైన ఘటనతో స్పందించిన ఆహార భద్రత శాఖ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ శనివారం విచారణ చేపట్టారు. తొలుత మెడికల్ కాలేజీ హాస్టల్ సందర్శించారు. అధికారులు, బాధిత విద్యార్థులు, వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థులు ఆహారం కొనుగోలు చేసిన డెస్టినేషన్ రెస్టారెంట్‌కు వెళ్లి తనిఖీ చేశారు. రెస్టారెంట్‌లో అపరిశుభ్రత వెలుగుచూసింది. వంటగదిలో ఈగలు, ఎలుకలు స్వైరవిహారం చేస్తూ కనిపించాయి. వంటనూనె నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. ముడిగుడ్లతో మయోనైస్ తయారు చేసినట్లు అనుమానించారు. భోజనశాల దుర్వాసన వ చ్చింది. దీంతో రెస్టారెంట్ నిర్వహణ ప్రజారోగ్యానికి ప్రమాదకరమని భావించి డెస్టినేషన్ రెస్టారెంట్‌ను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ విలేకరులకు తెలిపారు. ఆహా ర నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించామని, షెడ్యూల్–4 నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీ నిర్వహించామని వెల్లడించారు. మెస్ ఫుడ్ తినడంతోనే ఫుడ్ పాయిజన్ అయిందనినే తప్పుడు ప్రచారంపై విచారణ జరపాలని, ఫుడ్ పాయిజన్‌కు కారణమైన రెస్టారెంట్ ని ర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సిమ్స్ హాస్టల్ మెస్ కమిటీ ప్రెసిడెంట్ పాక ప్రశాంత్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


