వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన గార కంచినాయుడు అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు శనివారం మృతి చెందింది. గ్రామ సమీపంలోని దేవకివాడ పొలంలోకి పశువులను మేతకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరాడు.
విద్యుత్ షాక్‌తో చూడు గేదె..
వేపాడ: మండలంలో బొద్దాం పంచాయతీ శివారు కొత్త బొద్దాం గ్రామానికి చెందిన ఎర్రా అప్పారావు చూడు గేదె విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... శనివారం గ్రామానికి చెందిన ఎర్రా అప్పారావు చూడు పశువును గంగువాని చెరువు వద్ద మేపుతున్నారు. గేదె మేస్తూ విద్యుత్ స్తంభం వద్ద తెగి పడిపోయిన విద్యుత్ తీగను తాకడంతో విద్యుత్ షాకు గురై అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలుపు చేశారు. విద్యుత్ షాకు గురై మృతి చెందిన చూడు గేదె సుమారు రూ.లక్షా 50వేలు విలువ వుంటుందని స్థానికులు తెలిపారు.


