విశాఖలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు | - | Sakshi
Sakshi News home page

విశాఖలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు

Jun 14 2026 10:37 AM | Updated on Jun 14 2026 10:37 AM

విజయనగరం గంటస్తంభం: విశాఖపట్నంలో జూలై 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, జిల్లా కార్యదర్మి డి.రాము పిలుపునిచ్చారు. స్థానిక ఎల్బీజీ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత పదేళ్లలో ఎన్‌టీఏ నిర్వహించిన పరీక్షల్లో అనేకసార్లు పేపర్‌ లీకేజీలు జరిగాయని, నీట్‌, సీయూఈటీ, సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్మించారు. జిల్లాలో అనుమతులు లేకుండా కొన్ని విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ సంబంఽధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. విశాఖలో జరిగే అఖిల భారత మహాసభలకు దేశ వ్యాప్తంగా విద్యార్థి నాయకులు హాజరవుతారని, విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మహాసభల విజయానికి మేధావులు, విద్యార్థులు, యువత, ప్రజలు ఆర్థికంగా, నైతికంగా సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా గర్‌ల్స్‌ కన్వీనర్‌ ఆర్‌.శిరీష, జిల్లా ఉపాధ్యక్షుడు కె.జగదీష్‌, సహాయ కార్యదర్ములు సోమేష్‌, వంశీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement