దద్దరిల్లె ఊరు | - | Sakshi
Sakshi News home page

దద్దరిల్లె ఊరు

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

వెన్నుపోటుపై పోరు.. దద్దరిల్లె ఊరు సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం పూరించింది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తి గర్జించింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్ర బాబు సర్కారు పనితీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. యువత, మహిళలు, రైతులతో పాటు ఈ రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్న అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కదం తొక్కారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరో మారు నిరూపించుకున్నారని ఆరోపిస్తూ.. ఈ దుష్టపాలన రాష్ట్రానికి హానికరం అని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తూర్పు’లో జన సునామీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో కృష్ణలంకలోని ఫీడర్‌ రోడ్డులో ఎం హోటల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చివరలో యువగళం, సూపర్‌సిక్స్‌ పేరుతో కూటమి ఇచ్చిన హామీలకు సంబంధించిన పత్రాలను దహనం చేశారు. మాజీ డెప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖరరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండారెడ్డి, సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ దొడ్డా అంజిరెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ తదితరులు పాల్గొన్నారు. ‘పశ్చిమ’లో ప్రజా ప్రవాహం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్‌ నుంచి కేటీరోడ్డు, సామారంగంచౌక్‌, మొయిన్‌ బజార్‌ మీదుగా ఐరన్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ కొనసాగింది. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గౌస్‌మొహిద్దీన్‌, కర్నాటి రాంబాబు, బండి పుణ్యశీల, మనోజ్‌కొఠారి, తోలేటి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ‘సెంట్రల్‌’లో సమరశంఖం.. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యాన సత్యనారాయణపురం గాయత్రీ ఫంక్షన్‌ హాల్‌ నుంచి బీఆర్టీఎస్‌ రోడ్డు, ఎన్‌ఆర్‌పీ రోడ్డు, శివాజీ కేఫ్‌ సెంటర్‌, భగత్‌సింగ్‌ రోడ్డుమీదుగా ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. ప్రభుత్వ ముద్రణాలయం వద్ద మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గౌస్‌ మొహుద్దీన్‌, మాజీ డెప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజ తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట జనసంద్రం.. పేట పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసన ర్యాలీ ఎన్టీఆర్‌ సర్కిల్‌, బలుసుపాడు కూడలి సెంటర్‌, పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నినదిస్తూ కదం తొక్కారు. ర్యాలీ మధ్యలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, బీఆర్‌ అంబేడ్కర్‌, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ల చెల్లారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్‌(చిన్నా), రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాసగౌడ్‌, వైఎస్సార్‌ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శి మట్టా ప్రతాప్‌రెడ్డి, లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి సత్యశ్రీనివాసరావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ తదితరులు పాల్గొన్నారు. రెండేళ్ల ఆటవిక పాలనపై జనాగ్రహం

వైఎస్సార్‌ సీపీ పిలుపుతో కదిలొచ్చిన ప్రజానీకం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మండిపాటు ప్లకార్డులు చేతబూని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు

నినదించిన పెనమలూరు

మహిళలను దగా చేశారు..

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుపైనే దృష్టి..

వెన్నుపోటుపై పోరు..

గన్నవరం.. జనహారం..

గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక బుద్దవరం రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై గాంధీబొమ్మ సెంటర్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్‌ సలార్‌దాదా, ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్‌రాణి, పార్టీ నాయకులు కాకర్లమూడి సువర్ణరాజు, కొమరవల్లి గంగాభవాని, మేచినేని సత్యనారాయణ, వై నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి కార్యకర్తలు, నాయకులతో కలిసి వీరమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఉయ్యూరు సెంటరులో సభ నిర్వహించి, ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఉయ్యూరు తహసీల్దార్‌ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. తొలుత వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) కార్యక్రమం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కొద్దిసేపు మాటమంతి నిర్వహించారు.

మోసపూరిత వాగ్ధానాలతో కూటమి ప్రభుత్వం మహిళలను దగా చేస్తోంది. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ నెలకు రూ. 1,500 ఇస్తామనే ఎన్నికల హామీ ఇంతవరకు అమలు చేయలేదు. రెండేళ్లకుగాను ఒక్కొక్క మహిళకు ప్రభుత్వం రూ. 36వేలు బకాయి పడింది. సీ్త్రశక్తి పథకం, ఉచిత గ్యాస్‌, తల్లికి వందనం పథకాలు అమలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

– కూనపురెడ్డి రజని, గన్నవరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement