నేటి నుంచి యోగా పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి యోగా పోటీలు

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

● తొలిదశలో గ్రామ, వార్డు స్థాయిలో నిర్వహణ ● ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర–2026లో భాగంగా ఆదివారం నుంచి యోగా పోటీలు నిర్వహిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్‌ ఆల్‌ – గ్రాస్‌రూట్స్‌ వెల్‌నెస్‌ ఇతివృత్తంతో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో విజేతలు మండల స్థాయికి, మండల స్థాయిలో విజేతలు జిల్లాస్థాయికి, అక్కడ విజేత లుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ నెల పది నుంచి 12వ తేదీ వరకు యూనిటీతో యోగా – బ్రిడ్జింగ్‌ కమ్యూనిటీస్‌ థీమ్‌తో మండలస్థాయిలో, ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు యోగా అండ్‌ యూత్‌ – బిల్డింగ్‌ ఏ హెల్దీ ఫ్యూచర్‌ థీమ్‌తో జిల్లాస్థాయిలో, ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగాంధ్ర – ఆంధ్రాస్‌ గ్లోబల్‌ యోగా షోకేజ్‌ థీమ్‌తో రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీలో పోటీలు ఉంటాయని.. వ్యక్తిగత కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం ప్రదర్శనలు, గ్రూపు కేటగిరీలో సింక్రనైజ్డ్‌ గ్రూపుయోగా ఉంటుందన్నారు. యోగా సాంగ్‌, యోగా క్విజ్‌, యోగా స్లోగన్‌, యోగా ఎస్సే పోటీలు కూడా ఉంటా యని వివరించారు. 10 నుంచి 18 ఏళ్ల వారికి జూనియర్‌, 19 నుంచి 35 ఏళ్ల వారికి యంగ్‌, 35 ఏళ్లు, ఆపైన వారికి సీనియర్‌ గ్రూప్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల విజేతలను రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు 84980 12833, 83413 64185 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement