ఎ.కొండూరు: మండల పరిధి మత్రియా తండా గ్రామానికి చెందిన దారావతు శ్రీరాములు (38) అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం ఉదయం భార్య లేచి భర్తను లేపేందుకు వెళ్లగా అతనిలో చలనం లేదు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే అతను మృతిచెందాడు. ఉదయం 11 గంటల సమయంలో అంత్యక్రియల కోసం మృతదేహానికి స్నానం చేయిస్తుండగా వంటిపై గాయాలు కనిపించాయి. దీనితో మృతుడి సోదరి బూక్యా చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ గంధం మహాలక్ష్మణుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఆర్చరీలో సత్తా చాటిన కీర్తన
Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM
ఆర్చరీలో సత్తా చాటిన కీర్తన లబ్బీపేట(విజయవాడతూర్పు): మే 24 నుంచి 29 వరకూ గోవాలో జరిగిన ఆల్ ఇండియా ఇండోర్ టోర్నమెంట్‌లో అండర్ 21 ఆర్చరీ విభాగంలో నగరానికి చెందిన కె.రిషి కీర్తన సత్తా చాటింది. శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాలలో చదువుతున్న కీర్తన ఆ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుపొందినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా రిషి కీర్తనను శుక్రవారం ప్రిన్సిపాల్ పద్మజతో పాటు, ఇతర అధ్యాపకులు, సహచర విద్యార్థినులు అభినందించారు.
మత్రియా తండాలో వ్యక్తి అనుమానాస్పద మృతి
Advertisement


