గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కారును టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపూడికి చెందిన యడవల్లి ఆంజనేయులు, ఆయన భార్య అంజలిదేవి గుంటూరు నుంచి కారులో గొల్లపూడి బయలుదేరారు. వెస్ట్ బైపాస్‌లో నల్లకుంట వద్దకు చేరుకున్న కారు గొల్లపూడి వైపు తిరగకుండా కొంతదూరం ముందుకు వెళ్లిపోయింది. ఫీడర్ రోడ్డులో కారు వెనక్కు నడుపుతూ గొల్లపూడి వస్తుండగా టిప్పర్ వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో కూర్చున్న అంజలి దేవి( 59) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న ఆమె భర్త ఆంజనేయులు, మనవడు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం వడగాడ్పులకు వృద్ధుడు మృతి
కోడూరు: మండలంలోని ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామానికి చెందిన కోట వెంకట కృష్ణప్రసాద్ అలియాస్ కిట్టయ్య తాత (79) శుక్రవారం మధ్యాహ్నం వడగాడ్పుల తీవ్రతకు మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement


